
హైదరాబాద్, ప్రతినిధి : టాలీవుడ్ లో తెలంగాణ కళాకారులకు అంతగా ప్రాధాన్యం లేదని.. తెలంగాణ ఏర్పడిన తరుణంలో నవ కళాకారులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సినీ దర్శకుడు రఫీ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పొలిటికల్ ఫ్యాక్టరీ వెబ్ చానల్ ప్రారంభోత్సవం పొలిటికల్ ఫ్యాక్టరీ సీఈవో్ల, చీఫ్ ఎడిటర్ అయిలు రమేశ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో రఫీ మాట్లాడుతూ పీఎఫ్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. పొలిటికల్ ఫ్యాక్టరీ ఒక బాధ్యతగా అన్ని వెలుగులోకి తీసుకురావాలన్నారు. సినిమాల కోసం ఒక పేజి పెట్టాలని కోరారు. తెలంగాణ సినిమాలకు అసలు ప్రాధాన్యం లేదని.. వాటని కవర్ చేయాలంటే ఇలాంటి పీఎఫ్ లు రావాలన్నారు. కొన్ని పత్రికలు మన వార్తలు ప్రచురించడంలేదని దీనిపై తాను ఎంతో పోరాడనన్నారు. సినిమాలు తీసే అభిరుచి ఉన్న అణగదొక్కారని విమర్శించారు. తెలంగాణ సినిమాల అభివృద్ధికి ముందుకు రావాలని వేదిక ద్వారా అడుగుతున్నానన్నారు. మూడు వేల ఎకరాల రాచకొండ ఫిల్మ్ సిటీ కాకుండా.. సినిమా థియేటర్ల గుత్తాధిపత్యాన్ని ఎదురించి మూడు అంచెల వ్యవస్థను పునరుద్దరించాలని కోరుతున్నానన్నారు. మన సినిమాలు మనం నిర్మించినడే మనం బాగుపడతామన్నారు. మన కళాసంపద ధూంధాలకే పరిమితమా? మనకు అవకాశాలు రావాలని కోరానన్నారు. ప్రభుత్వం చిన్న నిర్మాతలు, దర్శకుల కష్టాలు తీర్చాలని కోరారు. మండలానికే ఒక మినీ థియేటర్లు ఏర్పాటు చేసి నిర్మించాలని కోరుతున్నాం.