తెలంగాణ కరెంట్ కష్టాలకు వానాకాలంతో చెక్

Power-agreement-400x255

దశాబ్దాల కరెంట్ కోతలకు గద్దెనెక్కగానే చెక్ పెట్టిన సీఎం కేసీఆర్.. ఈ ఖరీఫ్ అంటే వానాకాలం నుంచి రైతులకు ఉచితంగా 9 గంటల విద్యుత్ నందించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు నిన్న జరిగిన విద్యుత్ సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు.. ఈ నెల 5న భూపాలపల్లిలో నిర్మాణం పూర్తి చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కేటీపీపీ2ను సీఎం ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. దీనిద్వారా తెలంగాణకు 600 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందనుంది.. దీంతోపాటు ఆదిలాబాద్ జిల్లా జైపూర్ లో 1200 మెగావాట్ల విద్యుత్ ఏప్రిల్ వరకు అందనుంది. దీంతో సీఎం కేసీఆర్ అనుకున్న 9 గంటల విద్యుత్ రైతులకు ఉచితంగా అందిచవచ్చు.

కాగా దశాబ్దాల కరెంట్ కష్టాలను తీర్చి ఈ సంవత్సరంతో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ రాబోయే 2018వరకు దాదాపు 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణను విద్యుత్ ఉత్పత్తి భాండాగారంగా మార్చాలని సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *