
హైదరాబాద్ : తెలంగాణ ఏసీబీ పక్కాప్రణాళికతో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎక్కడ విషయం బయటకుపొక్కకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతోంది.. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను అరెస్ట్ చేయడం దగ్గర్నుంచి ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తోంది.
నిన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించారన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కేసులో కీలక మైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని మేజిస్టేట్ ముందు నమోదుచేయడానికి తెలంగాణ ఏసీబీ నిర్ణయించింది. దీని ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు, మంత్రులు, ఎంపీలకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతారు..