
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయగుండంగా మారింది. సముద్ర ఉపరితలం పైన దాదాపు 7.6 కి.మీ ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది.. ఈ అల్పపీడనంకు తోడు రుతుపవనాలు ఉండడంతో వానలు వేగంగా విస్తరిస్తున్నాయి.. దీంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, ఏపీకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ లో 6 సెం.మీల వర్సం కురిసింది. హైదరాబాద్ సికింద్రాబాద్ లో గంటసేపు ఏకథాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి..