తెలంగాణ ఎప్పటికీ ‘మిగులు’ రాష్ట్రమే..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నైజాంల కాలంనుంచి ఏపీలో, చివరకు స్వరాష్ట్రంగా ఎదిగినా కూడా ఎప్పుడు మిగుల బడ్జెట్ తో ఉన్న ఏకైక ప్రాంతమని మంత్రి కేటీఆర్ అన్నారు..తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే- ఐజేయూ) నూతన సంవత్సర డైరీని పంచాయతీరాజ్ , ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్ వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ పొందుతోందని అన్నారు..

హైదరాబాద్ భారత్ లో విలీనం అయినప్పుడు కూడా వందలకోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఉందని.. అందుకే ఆంధ్రా నాయకులు హైదరాబాద్ ను ఏపీలో కలిపి ఇక్కడి నిధులు దోచుకుపోయారని విమర్శించారు… నిజాంలు పరిపాలించినప్పుడే హైదరాబాద్ గొప్ప సిటీ అని ఇక్కడ మహారాష్ట్ర , కర్ణాటక, వివిధ సంస్కృతుల నిలయంగా విలసిల్లిందన్నారు. నిజాంల పరిపాలనలో సంపన్న రాజ్యంగా పేరుదొందిదన్నారు.. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి హైదరాబాద్ ఒక ప్రధానమైన ఆర్థిక వనరుగా ప్రతిసారి తన సత్తాచాటిందన్నారు.. ప్రతిపక్షాలు, నాయకులు హైదరాబాద్ వల్లే తెలంగాణకు ఇప్పుడు మిగులు బడ్జెట్ వచ్చిందని విమర్శిస్తున్నారని.. కానీ హైదరాబాద్ ను కొల్లగొట్టడానికే వారికి హైదరాబాద్ కావాల్సి వచ్చిందన్నారు. ఏపీ ఏర్పడినప్పుడు పీపీఆర్ విఠల్ అనే రచయిత రాసిన ఓ పుస్తకంలో తెలంగాణలోని హైదరాబాద్ ఆదాయాన్ని ఆంధ్రాకు మళ్లిస్తున్నారని.. తెలంగాణ సర్ ప్లస్ రాష్ట్రం అని కేస్ స్టడీ ద్వారా ఆంధ్రా నాయకుల బాగోతాన్ని బట్టబయలు చేసిందన్నారు… తెలంగాణ ఆదాయంకు అనుగుణంగా అభివృద్ది చెందలేదన్నారు.. 1947 నుంచి ఇప్పటి వరకు 2016 వరకు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే ఉందన్నారు.

సమైక్యాంధ్రలో హైదరాబాద్ ప్రధాన ఆర్థిక వనరుగా ఆంధ్రా నాయకులు ఉపయోగించుకున్నారని విమర్శించారు. భౌగోళికంగా హైదరాబాద్ పెరిగిందని… జీహెచ్ఎంసీ నుంచి హుడా వరకు ఎదిగిందన్నారు. తెలంగాణ జనాభాలో హైదరాబాద్లోనే ఒక కోటి జనాభా ఉన్నారన్నారు.. తెలంగాణలో మూడోవంతు జనాభా హైదరాబాద్ లోనే ఉందని.. అంతటి హైదరాబాద్ అభివృద్ది కి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రణాళికతో ముందుకుపోతోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే హైదరాబాద్ రూపురేఖలు మారుస్తాం..

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్,  సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, ఐజేయూ నాయకులు కే.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, హెచ్ యూ జే అధ్యక్ష కార్యదర్శులు కోటిరెడ్డి, చంద్రశేఖర్, ఫొటో గ్రాఫర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోవర్దన్ హరి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే అమర్ నాథ్, ఐజేయూ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఏంఎ మాజిద్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు అయిలు రమేశ్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా అద్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేశ్, బల్మూరి విజయ్ కుమార్, నాయకులు గాండ్ల శ్రీనివాస్, శంకర్ గౌడ్, భద్రాచలం, లాయక్ పాషా, ఈద మధుకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాద్యక్షులు దొంతు రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *