Breaking News

తెలంగాణ ఎంపీల దూకుడు..

0(64)

లోక్ సభలో తెలంగాణ ఎంపీలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఏకబిగిన ైదు ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారు. ఇందులో రెండు బిల్లులు తెలంగాణ ప్రధాన సమస్యల పరిష్కారానికి ఉద్దేశించినవి కాగా.. మిగిలినవి ప్రజోపయోగ అంశాలకు సంబంధించినవి..

తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు పెంచేందుకు ఒక బిల్లు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ను కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాసైతే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచుకునే వీలు కలుగుతుంది.. అనంతరం బిల్లులో రెండేండ్లలోపు హైకోర్టు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయాలనే వ్యాక్యాన్ని చేర్చాలని మరో సవరణ బిల్లును ప్రతిపాదించారు. దీని వల్ల వచ్చే మే నెలాఖరుకల్లా రాష్ట్ర హైకోర్టు విభజన తప్పనిసరి అవుతుంది..

ఇక ఎంపీ జితేందర్ రెడ్డి రాజకీయ పార్టీలు తిరిగి అధికారంలోకి రావడం కోసం నిర్ధిస్ట కాలపరిమితి ముగియకముందే చట్టసభలను రద్దు చేయడాన్ని నివారించేలా ఓ బిల్లు ప్రవేశపెట్టారు. మరో బిల్లులో అత్యవసర సమయాల్లో దవాకానాల్లో వైద్య చికిత్స అందించే విషయంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకునే విధంగా క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ మూల చట్టానికి సవరణలు ప్రతిపాదించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *