
తెలంగాణలో త్వరలో వెలువడే గ్రూప్ 3 , గ్రూప్ 4 లాంటి కిందిస్థాయి పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఇటీవల పెరుగుతున్న కంప్యూటర్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఉద్యోగికీ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరమని తేల్చారు.
అందులో భాగంగానే గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో కంప్యూటర్ పై పేర్కొంటారట.. ఆ తరువాత ఎంపికైన వారిని షార్ట్ లిస్ట్ తయారు చేసి వారికి హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో పరీక్ష నిర్వహించి కంప్యూటర్ పరిజ్ఞానం పరీక్షిస్తారట.. అందులో పాసైతేనే ప్రభుత్వ ఉద్యోగం.. సో నిరుద్యోగులు సిద్దం కండి..