తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోండి..

Pawan Kalyan Jana Sena Party Launch

కాపుల ఉద్యమంపై పవన్ స్పందించారు. ఉద్యమం చేసే తీరు ఇది కాదని కాపులకు, కాపు ఉద్యమ నాయకులకు సూచించారు. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక ఐకాసాగా ఏర్పడి శాంతియుత ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు.. హింసాత్మక వాతావరణంతో హక్కులు సాధించరని..చరిత్రలో హింసవల్ల ఏ ఉద్యమం తీరాలకు చేరలేదని పవన్ పునరుద్ఘాటించారు.

ఏపీలో చెలరేగుతున్న కాపుల మహోద్యమంపై కంగారుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బాసటగా నిలవడానికి పవన్ వచ్చారు.. కాపుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో దీన్ని ఎలాగైనా సద్దుమణిగించేలా కృషి చేయాలని పవన్ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చారు చంద్రబాబు సైతం టీడీపీ మిత్రుడు, ఎన్నికల భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ సహాయం కోరారు..  స్వయాన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పవన్ చెబితే ఈ ఉద్యమం చల్లబడుతుందని చంద్రబాబు యోచించారు.

అందుకే ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ కోసం కేరళ వెళ్లిన పవన్ ను హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు .. ఎలాగైనా సరే కాపుల్లో బలమైన నేత అయిన పవన్ తో గట్టి ప్రకటన చేయాలని బాబు యోచిస్తున్నారట.. పవన్ సైతం సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు.. కాపుల ఆందోళన పవన్ ను కలిచి వేసిందని ఆయన సన్నిహితులు చెప్పారు.. అందుకే హైదరాబాద్ వచ్చారన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *