తెలంగాణ ఆర్థోపెడిక్ డాక్టర్స్ అసోసియేషన్ మీట్ ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన లక్ష్మారెడ్డి

తెలంగాణ ఆర్థోపెడిక్ డాక్టర్స్ అసోసియేషన్ మీట్ ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి

మంత్రి లక్ష్మారెడ్డి కామెంట్స్

గ్రేట్ విజనరీ తెలంగాణ సీఎం కెసిఆర్ నేతృత్వంలోవైద్య రంగం అద్భుతంగా అభివృద్ధి పథంలో నడుస్తున్నది

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రజా వైద్యం పరివ్యాప్తికి ప్రభుత్వ కట్టుబడి ఉంది. చిట్టా శుద్ధితో పని చేస్తున్నది

రాష్ట్రంలోని ఏరియా, జిల్లా, టీచింగ్ హాస్పిటల్స్ లో ట్రామా సెంటర్స్ ని ఆధునీకరిస్తున్నాం

రోడ్ ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం

అన్ని జిల్లాల్లోనూ ఆర్థో ట్రామా సెంటర్స్ ని నెలకొల్పుతున్నాం

ఆర్థో పరికరాలు, అన్ని జిల్లా, ఏరియా హాస్పిటల్స్ లో అందుబాటులోకి తెస్తున్నాం

మోకాలు చిప్పల మార్పిడులు నిమ్స్, ఉస్మానియా, రిమ్స్, గాంధీ లాంటి దవాఖానాల్లో జరుగుతున్నాయి

నిమ్స్ లో 200 నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి

గాంధీ , ఉస్మానియాలో పాటు మిగతా హాస్పిటల్స్ లోనూ ఆపరేషన్లు జరగడానికి అవసరమైన పరికరాలు అందచేస్తున్నాం

ఒక ofgaan విదేశీయుడికి అరుదైన ఆర్థో ఆపరేషన్ ని పూర్తీ ఉచితంగా ఉస్మానియా లో చేయించాం

108 సేవలను మరింత విస్తృతం, పటిష్టం చేసి ప్రమాదాలు జరిగిన కొద్దీ సేపట్లోనే హాస్పిటల్స్ కి చేరవేసి, చికిత్స అందే విధంగా చర్యలు చేపడతాం

పోలీస్ విభాగం తో కలిసి, ఆక్సిడెంట్ కేసుల్లో సత్వర వైద్యం అందేందుకు కృషి చేస్తాం

ఆర్థో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి విడిగా ప్రత్యేక పరీక్ష నిర్వహించడానికి కేంద్రంతో మాట్లాడతాం

ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కామెంట్స్…

రాష్ట్రము వచ్చాక తెలంగాణ ఆర్థో డాక్టర్లు సంఘం గా ఏకమవడం హర్షణీయం

పోలీస్ తో కలిసి రోడ్ ప్రమాదాల నివారణకు ప్రయత్నిద్దాం.

నిన్న, ఇవ్వాళ, రేపు మూడు రోజులుగా సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో జరుగుతున్న సదస్సు

ఆర్థోపెడిక్ విభాగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులు, వాటిని ప్రజోపయోగంలోకి తేవడం మీద జరుగుతున్న సదస్సు

ఈ సదస్సులో పాల్గొన్న ఎంపీ బూర నర్సయ్య గౌడ్

పాల్గొన్న TOSACON-2017 వర్గానిసింగ్ చైర్మన్ రవి బాబు, ప్రశాంత్, విజయభాస్కర్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మంజుల, హాస్పిటల్ సూపరింటెండెంట్ జేవీ రెడ్డి తదితరులు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *