తెలంగాణ ఆగం కావొద్దనే సీఎం పదవిని చేపట్టాను

తెచ్చిన తెలంగాణ ఆగం కావొద్దనే సీఎం పదవిని చేపట్టానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఖమ్మంలోని ఎస్‌ఆర్, బీజీఎన్‌ఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ తెచ్చిన తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఆగం కావొద్దని పిలుపునిచ్చారు.

2001 ఏప్రిల్ 27రోజున హైదరాబాద్ జలదృశ్యంలో ఉద్యమాన్ని ప్రారంభించామని,
అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు. కానీ గులాబీ జెండా మాత్రం రెపరెపలాడుతోందన్నారు.
ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించాలనే ధృడ సంకల్పంతో ఉద్యమాన్ని ప్రారంభించి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ముందుకు సాగినమన్నారు.
14ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ కల సాకారమైందన్నారు. ఖమ్మంలో 15వ ప్లీనరీ, బహిరంగసభను ఆత్మగౌరవంతో జరుపుకుంటున్నమన్నారు.

ప్రతీ ఇంటికి మంచి నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటే అని అన్నారు.
వచ్చే డిసెంబర్ నాటికి 95శాతం మిషన్‌భగీరథ పనులు పూర్తిచేస్తామన్నారు. .
గత పాలకులు ఖమ్మం జిల్లాకు ఏం చేశారని ..పక్కనే నదులున్నా సాగునీరు, తాగునీరు ఎందుకందించలేదని ప్రశ్నించారు.

ఖమ్మం జిల్లాలో ప్రతీ ఇంచు భూమికి నీళ్లందిస్తామని సీఎం స్పష్టం చేశారు.
గోదావరి, కృష్ణా జలాలతో రాష్ట్రంలోని కోటి ఎకరాలకు నీళ్లందిస్తామని.. ఆకుపచ్చ తెలంగాణ కళ్లారా చూడాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.35వేలకోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు.
డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం దేశంలో ఎక్కడాలేదని..ఒక్కసారి ఇండ్లు కట్టిస్తే రెండు తరాల దాకా నిలువాలని అన్నారు.
మానవీయ కోణంలో ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు.

ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఇక రాష్ట్రంలో కరెంట్ కోతలుండవని..2019 నాటికి రైతులకు 24గంటలు కరెంట్ ఇస్తమని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎటు పోయినా టీఆర్‌ఎస్‌దే విజయమన్నారు. న్యాయం ఎప్పుడైనా జయిస్తదని..ప్రజలు ఎప్పుడూ ఇదే మద్దతును కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ప్రజల బాగోగులే తమ ఎజెండా అని..టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలే బాసులని కేసీఆర్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *