తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ, టీఆర్ఎస్ ఘర్షణ

ts govarner

-తోపులాట, ఘర్షణ -టీడీపీకి మద్దతు పలికిన కాంగ్రెస్

హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు తోపులాడుకొని చొక్కాలు పట్టుకుని నెట్టి వేసుకున్నారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగించేందుకు వచ్చారు. ఉభయ సభల సభ్యులు కొలువుదీరిన వేళ.. గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ప్రసంగం మొదలైన కొద్ది సేపటికే టీడీపీ ఎమ్మెల్యే లు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. టీడీపీ సభ్యులను అక్రమంగా టీఆర్ఎస్ లో చేర్చుకొని వారిపై చర్యతీసుకోవడం లేదని.. వారిని భర్తరఫ్ చేయాలని టీడీపీ నాయకులు సభలో నిరసన తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ గవర్నర్ పై కాగితాలు విసరడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడికి దిగారు.  ఈ దాడిలో టీడీపీ ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. పరస్పరం టీడీపీ , టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తోపులాడుకున్నారు.

ఈ గందరగోళం మధ్యే గవర్నర్ ఆదరబాదరగా ప్రసంగం చదివి.. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి ని చదివి వినిపించారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *