తెలంగాణ అవతరణ వేడుకలకు 20 కోట్లు

తెలంగాణ తొలి అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందుకోసం 20 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జిల్లాకు ఒక కోటిచొప్పున 10 కోట్లు.. తెలంగాణ అవతరణ వేడుకలకు 10 కోట్లు.. ఇందులో  రాష్ట్ర స్థాయి ప్రతిభ కనబరిచిన వారికి రూ.1.16 లక్షల పారితోషకం, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి రూ.50,116 , మండలస్థాయికి  10,116లు  చొప్పున సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పాఠశాలల్లో ఘనంగా అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని .. జూన్ చివరి వారంలో వారి వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని పేర్కొంది.

కాగా పోయిన ఏడాది లాగే ఈ సంవత్సరం తెలంగాణ అవతరణ వేడుకలను గొల్కండ కోటలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 నుంచి 8 వరకు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *