
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించగానే టెన్నిస్ స్టార్ సానియామీర్జా అదృష్టం బంక పట్టినట్టే పట్టుకుంది. అంతకుముందు ఎప్పుడో ఒకటి అరా గెలిచే సానియా తెలంగాణకు అంబాసిడర్ గా కేసీఆర్ ప్రకటించగానే పథకాల మీద పథకాలు సాధిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్ ల చేత ప్రశంసలు అందుకుంటోంది..
స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్ తో జతకలిసిన సానియా మీర్జా యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలిచేసింది.. 24 గంటలకు ముందు ఇదే హింగిస్ జతగా లియండర్ పేస్ యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్ టైటిల్ నెగ్గగా.. ఇఫ్పుడు సానియా డబుల్స్ నెగ్గింది..
కాగా కొద్ది రోజులుగా సానియా , హింగిస్ జోడి వరుసగా గెలుస్తూ ఓపెన్ లలో అదరగొడుతుంది.. ఈ ఏడాది హింగిస్ సానియా వింబుల్డన్ కూడా నెగ్గారు.
ఈ గెలుపు తెలంగాణ బ్రాండ్ అదృష్టమా.. లేక కేసీఆర్ ‘కోటి’ ప్రొత్సాహామా.. ఏమోగానీ సానియాకు మాత్రం తెలంగాణ లింక్ తో అదృష్టం కలిగింది..