
తెలంగాణ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పే విధంగా ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తుందని రాష్ట్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. శుక్రువారం సనత్ నగర్
నియోజకవర్గంలోని రాంగోపాల్ పేట డివిజన్ కర్బలా మైదానంలో ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లపై మంత్రి వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. కర్బలా మైదానంలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలకు మహిళలు
వేల సంఖ్యలో తరలివస్తారని మంత్రి తెలిపారు. కర్బలామైదానంలో పాటు మోక్షహోటల్, అంబేద్కర్ నగర్, పి.వి.ఘాట్ తదితర ప్రాంతాలలో కూడా మహిళలు బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. అందుకు తగిన విధంగా ఆయా ప్రాంతాలలో లైట్లను ఏర్పాటు
చేయాలని, బతుకమ్మ ఉత్సవాల వద్దకు వచ్చే వారి కోసం త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలిసి పరిశీలించారు. ద్వంసమైన పుట్ పాత్ ల మరమ్మత్తులు చేపట్టాలని, రోడ్లపైకి వచ్చిన చెట్ట కొమ్మలను
వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం పాలన వచ్చిన తరువాత అన్ని పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. బతుకమ్మ పండుగను దేశ విదేశాలలో సైతం తెలంగాణ ఆడపడుచులు వైభవంగా జరుపుకుంటున్నారంటే బతుకమ్మకు ఎంత విశిష్టత ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా కోటి 4లక్షల మందికి చీరలను పంపిణీ చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని శాఖల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. బతుకమ్మ ఉత్సవాల నేపధ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాసగౌడ్, డిసి శైలజ, జిహెచ్ ఎంసి ఈఈ సురేష్, హెల్త్ శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్, హెచ్ ఎండిఏ సిఈ బి.ఎన్.రెడ్డి, డిఈ రాజు, ఆర్ అండ్ బి డిఈ రవింద్రమోహన్, ట్రాఫిక్ ఏసిపి ముత్యం రెడ్డి, సిఐ చంద్రశేఖర్, వాటర్ వర్క్స్ మేనేజర్ సుదర్శన్, స్ట్ర్రీట్ లైట్స్ ఈఈ భాస్కర్, డిఈ మహేష్, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.