తెలంగాణా రాష్ట్రాన్ని సందర్శించిన పంజాబ్ మార్కెటింగ్ బోర్డు అధికారులు

తెలంగాణా రాష్ట్రాన్ని సందర్శించిన పంజాబ్ మార్కెటింగ్ బోర్డు అధికారులు

పంజాబ్ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డు ఛైర్మన్ శ్రీ లాల్ సింగ్ గారి నేతృత్యంలో (6) సభ్యులు గల బృందం నేడు మన రాష్ట్రాన్ని సందర్శించారు మొదటగా, తెలంగాణ రాష్ట్రంలోని వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీల‌లో అమ‌లు అవుతున్న e NAM విధాన‌మును ప‌రిశీలించ‌డానికి గాను సూర్యాపేట వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీని సంద‌ర్శించారు గేట్ ఎంట్రీ ద‌గ్గ‌ర నుండి స‌రుకు బ‌యట‌కు వెళ్ళు వ‌ర‌కు గ‌ల అన్ని విధానాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ముఖ్యంగా రైతుల కొర‌కు గేటు వ‌ద్దే కాకుండా యార్డు మ‌ద్య‌లో గ‌ల షెడ్డుల‌లో కూడా ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన గేట్ ఎంట్రీ కౌంట‌ర్ల‌ను చూసి ఆనందం, ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసారు. లాట్ ఎలాట్‌మెంట్, బిడ్డింగ్‌ మ‌రియు మొబైల్ యాప్‌ విధానంపై ఆస‌క్తిగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మొబైల్ యాప్‌ విధానంపై మ‌రీ మ‌రీ ప్ర‌శ్న‌లు వేసి సందేహాలను తీర్చుకున్నారు. మార్కెట్ యార్డులో వ్యాపార‌స్తులు బిడ్డింగ్ వేయ‌డం, ఫ‌లితాలు వెల్ల‌డించ‌డాన్ని ద‌గ్గ‌ర ఉండి చూశారు. మార్కెట్‌యార్డులో ఉన్న రైతులు, వ్యాపార‌స్తులు మ‌రియు క‌మీష‌న్ ఏజెంట్లతో సంభాషించారు. వారి నుండి ఈ-నామ్ ఉప‌యోగాల గురించి అడిగి మ‌రీ తెలుసుకున్నారు. గ‌తంలో ఉన్న విధానం కంటే ప్ర‌స్తుత ఈ-నామ్ విధానంలో సమ‌యం ఆదా అవ‌డ‌మే కాకుండా పార‌ద‌ర్శ‌కంగా కూడా ఉన్న‌ద‌ని రైతులు వివ‌రించారు. సాయంత్రం ప్రభుత్వ కార్యదర్శి శ్రీ సి. పార్థ సారధి గారితో సచివాలయంలో సమావేశంమై మార్కెటింగ్ శాఖలో జరుగుతున్న వివిధ అభివృధి కార్యక్రమాలు పనితీరు, రైతుల కోసం ఆ శాఖ చేపటుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి, రైతుల ఉత్పత్తులను నిలువ చేయుట కోసం అధునాతనంగా నిర్మించిన గోదాముల గురించి ఆ శాఖ పవర్ పాయింట్ ప్రసంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. బృంద సభ్యులు ఎంతో ఆసక్తిగా తిలకించి వారికి ఉన్న సందేహాలన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల కొర‌కు తీసుకుంటున్న చ‌ర్య‌లు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయ‌ని, ఈ విధానాన్ని పంజాబ్‌లో అమ‌లు చేయ‌డానికి మా ఈ సంద‌ర్శ‌న ఎంతో అనుభూతిని, అనుభ‌వాన్ని తెచ్చిపెట్టింద‌ని శ్రీ విశ్వ‌జిత్ ఖ‌న్నా త‌మ అభిప్రాయాన్ని తెలియ‌జేశారు. ఈ సంద‌ర్శ‌న‌లో పంజాబ్ రాష్ట్ర వ్య‌వ‌సాయ మార్కెటింగ్ బోర్డు కార్య‌ద‌ర్శి శ్రీ అమిత్ ధాఖా, I.A.S., సంయుక్త సంచాల‌కులు శ్రీ ద‌ల్‌వింద‌ర్‌జిత్ సింగ్‌, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ కుల్‌దీప్ సింగ్ బ్రార్ మ‌రియు జిల్లా మండీ అధికారి శ్రీ మంజిత్ సింగ్ సంధు గార్లు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *