తెలంగాణాకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తాం: సిఎఫ్ టిఆర్ ఐ

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తుల నుండి వ్యాల్యు ఆడెడ్ ప్రోడక్ట్స్ తయారుచేసి మరింత విలువను జోడించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్జనాన్ని అందించి, తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇనిస్ట్యూట్ (CFTRI) అంగీకారం తెలిపింది. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి నేత్రుత్వంలోని బృందం మైసూర్ లోని CFTRI కేంద్ర కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాడానికి మంత్రి పొచారం నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటల నుండి బైప్రోడక్ట్స్ తయారుచేయడంలో పేరెన్నికగన్న సంస్థ CFTRI. ఒక్కరోజు పర్యటనలో బాగంగా మైసూర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర బృందం పలు ఉత్పత్తులలో తయారి, నిల్వ, మార్కెట్ లో అవకాశాలను పరిశీలించింది. ముందుగా CFTRI కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర బృందానికి CFTRI అధికారులు కన్నడ సంప్రధాయ పద్దతులలో ఘనంగా స్వాగతం పలికారు. తదనంతరం మొదట పైలెట్ ప్లాంట్ ను సందర్శించిన బృందం అక్కడ దోశ, చపాతి, ఇడ్లీ ని యంత్రాల ద్వారా తయారు చెసే విధానాన్ని పరిశీలించారు. వేరుశనగ విత్తనాలను వేయించే, ప్యాకింగ్ చెసే యంత్రం ప్రత్యేకతను అధికారులు వివరించారు. మొక్కజొన్న నుండి బిస్కెట్లు, కుకీస్, పౌడర్ వంటి ఉత్పత్పుల తయారు, ప్యాకింగ్ ను పరిశీలించారు. పసుపు ప్రాసెసింగ్ టెక్నాలజీపై రాష్ట్ర బృందం అధిక ఆసక్తిని కనబరిచింది. పసుపు నుండి వంట కోసం వాడే పౌడర్ తో పాటు పారిశ్రామిక అవసరాల కోసం కర్కుమిన్, పోలేయారెజిన్ వంటి ఉప ఉత్పత్తులను తయారు చేయడం వలన రైతులకు అధిక లాభాలు వస్తాయని CFTRI అధికారులు వివరించారు. మాములు పద్దతులలో పసుపును పౌడరుగా మార్చడానికి 45 రోజుల సమయం అవసరం అవుతుండగా CFTRI అభివృద్ధి చేసిన టెక్నాలజితో కేవలం ఎనిమిది (8) గంటలలోనే పౌడరుగా మార్చవచ్చు. రోజువారి గృహాలలో నిత్యం వాడే అల్లం, వెల్లుల్లి మిశ్రమానికి తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలలో డిమాండ్ అధికంగా ఉన్నది. ఈ మిశ్రమంలో కల్తీ నివారణకు తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలతో గ్రామాలలోనే తయారుచేయించి స్థానికంగానే అమ్మకాలు చేయించడం ద్యారా నాణ్యతతో పాటు, తక్కువ ధరలోనే వినియోగదారులకు దొరికే విదంగా ప్రోత్సహించాలని భావిస్తుంది. ఈ పద్దతిలో రైతులకు మార్కెటింగ్ సమస్య ఉండదు, ధర ఎక్కువగా లభిస్తుంది. ఈ అల్లం,వెల్లుల్లి తయారికి, ప్యాకింగ్ కు అవసరమైన సాంకేతికతను CFTRI అభివృద్ధి పరిచింది. తక్కువ ధరతో చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు బృందానికి వివరించారు. అల్లం, వెల్లుల్లి, పసుపు కొమ్ములను ముక్కలుగా కత్తిరించే యంత్రం కూడా అభివృద్ధి చేసినందున తక్కువ శ్రమతో, తక్కువ పెట్టుబడితో ఈ అల్లం, వెల్లుల్లి పరిశ్రమను స్థాపించుకోవచ్చని అధికారులు తెలిపారు. అదేవిదంగా CFTRI అభివృద్ధి చేసిన ప్రోటీన్ టెక్నాలజి డిపార్ట్మెంట్ లో సోయాబిన్ ప్రాసెసింగ్, నువ్వుల పేస్ట్, షుగర్ కేన్ జ్యూస్ తయారి, మిరియాలు, ధనియాలను పౌడరుగా మార్చి ప్యాకింగ్ చెసే యంత్రాలను పరిశీలించారు. పండ్లు, కూరగాయల సాంకేతిక అంశాలలో టమాట నుండి సాస్, సూప్, బంగాళదుంపలను డ్రైయింగ్, చిప్ గా తయారు చేయడం పరిశీలించారు. నేటి ఆధునీకతకు అనుగుణంగా, వినియోగదారులకు సమయం వృధా కాకుండా ఉండటం కోసం బీన్స్, క్యారెట్ లను ముక్కలుగా చేసి, ప్యాకింగ్ చేసి రెడీ టూ యూజ్ పద్దతిని పరిశీలించారు. పండ్ల నుండి జ్యూస్ ల తయారి, ప్యాకింగ్, ఎక్కువ కాలం నిల్వ ఉంచే పద్దతులను శాస్త్రవేత్తలు వివరించారు. తదుపరి CFTRI కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పండుతున్న పంటలు, విస్తీర్ణం, ఉత్పత్తి, వినియోగం, మార్కెటింగ్ వంటి అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్ధసారది వివరించారు. రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తుల నుండి బైప్రోడక్ట్స్ తయారు చేయడం వలన రైతులకు మేలు జరిగి అదనపు ఆధాయం సమకూర్చడంతో పాటు వినియోగధారులకు నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించడమే తమ ప్రభుత్వ ద్యేయమని మంత్రి పొచారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సంసిద్దంగా ఉన్నామని CFTRI అధికారులు రాష్ట్ర బృందానికి తెలిపారు. త్వరలోనే తమ శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందం తెలంగాణలో పర్యటనకు వస్తామన్నారు. రాష్ట్ర ఉద్యానశాఖ సిద్దిపేట జిల్లా ములుగులో నిర్మిస్తున్న స్పైస్ ప్లాంట్ DPR (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ను CFTRI డైరెక్టర్ జితెందర్ జాదవ్ మంత్రి పొచారం కు అందజేశారు. మన రాష్ట్ర బృందంలో గుత్తా సుఖేందర్ రెడ్డి- చైర్మన్ ( రాష్ట్ర రైతు సమన్వయ సమితి ). జయేష్ రంజన్- IAS , ముఖ్యకార్యదర్శి (పరిశ్రమల శాఖ). సి. పార్ధసారది IAS- ముఖ్యకార్యదర్శి (వ్యవసాయ శాఖ), యల్. వెంకట్రామిరెడ్డి- డైరెక్టర్ (ఉద్యానశాఖ), శ్రీమతి లక్ష్మీబాయి- డైరెక్టర్ (మార్కెటింగ్). కె. వనజాత, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ (ఉద్యాన విశ్వవిద్యాలయం), జి. అఖిల్ కుమార్ గవార్, డైరెక్టర్-(తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటి). CFTRI నుండి జితేందర్ జాదవ్, డైరెక్టర్, డా. సుబ్రహ్మణ్యం (చీఫ్ సైంటిస్ట్), డా. వివి సత్యేంద్ర రావు (హెడ్ టెక్నాలజీ) ఇతర విభాగాల శాస్త్రవేత్తలు, అధికారులు ఉన్నారు.

pocharam srinivasa reddy 1     pocharam srinivasa reddy 2     pocharam srinivasa reddy 3     pocharam srinivasa reddy 4    pocharam srinivasa reddy 5     pocharam srinivasa reddy 6

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *