
-కరీంనగర్ కలెక్టర్ గా నీతూకుమార్ ప్రసాద్
-కరీంనగర్ కలెక్టర్ వీరబ్రహ్మయ్య జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ
-కరీంనగర్ జేసీ సర్ఫరాజ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ
హైదరాబాద్, ప్రతినిధి : ఐఏఎస్ అధికారుల విభజన ఒక కొలిక్కి రావడంతో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ.. ఇప్పటివరకు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నవారికి పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియ రెండు రోజుల ముందే జరగాల్సి ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో ఉండడంతో ఆదివారం అర్ధరాత్రి బదిలీలు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
పలువురు ఐఏఎస్‌లు బదిలీ
పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న ఎంజీ గోపాల్, రంజీవ్ ఆర్.ఆచార్య, నవీన్‌మిట్టల్, నీతూకుమారి ప్రసాద్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఎంజీ గోపాల్‌ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, రంజీవ్ ఆర్.ఆచార్యను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, నవీన్‌మిట్టల్‌ను జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా, నీతూకుమార్ ప్రసాద్‌ను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఇక కరీంనగర్ జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్యను జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వరంగల్ జిల్లా కలెక్టర్‌ను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా,.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా రఘునందన్‌రావును నియమించారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శినిని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పి.సత్యనారాయణరెడ్డిని నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. టి.కె.శ్రీదేవిని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా, కె.కరుణను వరంగల్ జిల్లా కలెక్టర్‌గా, కె.నిర్మలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు.
జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా గౌరవ్ ఉప్పల్
గౌరవ్ ఉప్పల్‌ను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా, రజత్ కుమార్ సైనీ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, పౌసుమి బసు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. సురేంద్రమోహన్ను హైదరాబాద్ జాయింట్ కలెక్టర్‌గా, సర్ఫరాజ్ అహ్మద్‌ను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిణిగా భారతి హొళ్లికెరిని నియమించారు. దాసరి హరిచందనను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, పాటిల్ ప్రశాంత్ జీవన్‌ను వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, డి.కృష్ణ భాస్కర్‌ను కరీంనగర్ జిల్లా జగిత్యాల సబ్‌కలెక్టర్‌గా బదిలీ చేశారు. అలగు వర్షిణిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా, రాజీవ్‌గాంధీ హనుమంత్‌ను ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా, కాళీచరణ్ సుదమ్రావును ఖమ్మం జిల్లా పాల్వంచ సబ్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.