
సీఎం కేసీఆర్ ప్రకటించిన కొత్త జిల్లాల ప్రక్రియకు ముందడుగు పడింది.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులతో సమాలోచనలు జరిపి కొత్త జిల్లాల ఏర్పాటుకు ముసాయిదా సిద్ధం చేశారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జిల్లాలకు తోడు కొత్తగా మరో 12 పెరిగే అవకాశం ఉంది. జిల్లాల భౌగోళిక స్వరూపాలు, ఇతరఅంశాలను పూర్తి స్థాయిలో కమిటీ పరిశీలించనుంది.
హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల చుట్టూ కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేస్తారు. రాజధాని శివార్లలో వాటిలో కలుపుతారు. రంగారెడ్డి జిల్లా కేంద్రంగా వికారాబాద్ ఉంటుంది. కొత్తగా చేవెళ్ల, భువనగిరి లేదా బీబీనగర్, షాద్ నగర్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేసి నగరశివారు ప్రాంతాలను కలుపుతారు.
ఇక మహబూబ్ నగర్ జిల్లాలో షాద్ నగర్ తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి.
నల్గొండలో భువనగిరితో పాటు సూర్యపేట కేంద్రంగా మరో కొత్త జిల్లా.
కరీంనగర్ జిల్లా : జగిత్యాల కేంద్రంగా మరో జిల్లా,
ఆదిలాబాద్ లో : మంచిర్యాల
మెదక్ : సంగారెడ్డి , మెదక్, సిద్దిపేట
నిజామాబాద్ : కామారెడ్డి
ఖమ్మం : కొత్తగూడెం
వరంగల్ : జిల్లాలో కొత్త జిల్లా ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. విభజనలో నియోజకవర్గాలు పోనూ వరంగల్ మాత్రమే జిల్లాగా కొనసాగనుంది.