తెలంగాణలో వికసించిన ‘పద్మం’

-వర్థమాన నటి పద్మా గంగావత్ కు ఘన సన్మానం
-బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పొలిటికల్ ఫ్యాక్టరీ వెబ్ చానల్ ప్రారంభోత్సవంలో పద్మను వేయినోళ్ల పొగిడిన అతిథులు
హైదరాబాద్, ప్రతినిధి : వర్థమాన నటి, బంజారాల్లోని ఆణిముత్యం, రాజ్యాధికారం హీరోయిన్ పద్మ గంగావత్ పై  ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పొలిటికల్ ఫ్యాక్టరీ వెబ్ ఛానల్ ప్రారంబోత్సవంలో పొలిటికల్ ఫ్యాక్టరీ సీఈవో, చీఫ్ ఎడిటర్ అయిలు రమేశ్ ఆద్వర్యంలో హీరోయిన్ పద్మ గంగావత్ ను ముఖ్య అతిథులు ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, సీనియర్ జర్నలిస్ట్ లు , వై నరేందర్ రెడ్డి, కోటిరెడ్డి , దర్శకుడు నటుడు రఫీ, హీరోయిన్ పద్మా గంగావత్ , సంగీత దర్శకుడు బొంబాయి బోలే, వైసీపీ నాయకుడు గట్టు రాంచంద్రరావు, నటుడు పొట్టి వీరయ్య, ఏ.రాజేశ్, నిర్మాత, దర్శకులు నర్సింహా, యాదగిరి తదితరులు ఘనంగా సన్మానించారు.

ఎక్కడో వరంగల్-ఖమ్మం సరిహద్దులోని ఒక మారుమూల గిరిజన తండా నుంచి వచ్చిన పద్మ గంగావత్ ను తెలంగాణలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం గొప్ప విషయమన్నారు. చిన్నప్పటి నుంచి కళలే శ్వాసగా బతికి హీరోయిన్ కావాలని కలలు గన్న పద్మకు నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి గారు రాజ్యాధికారంలో అవకాశం కల్పించి హీరోయిన్ చేశారని.. ఆమె నటన అందులో నభూతో నభవిష్యత్తులా ఉందన్నారు. ఎంతో పరిణితి చెందిన నటిలా మొదటి సినిమాలో నటించిన పద్మ మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
padma-gangavath.jpg22
ఈ సందర్భంగా పద్మ గంగావత్ మాట్లాడుతూ బంజారా తెగ నుంచి వచ్చిన తాను హీరోయిన్ గా ఎదగడానికి ఎంతో కష్టపడ్డానన్నారు. తాను కొన్ని షార్ట్ ఫిల్మ్ లు చేశానని.. రానున్న రోజుల్లో మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నానని.. తెలంగాణ సమాజం మద్దతు తనకు కావాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.