తెలంగాణలో రైత‌న్న‌ల‌కు అందుతున్న స్వపరిపాలన ఫలాలు

KKP_6655స్వ‌ప‌రిపాల‌న ఫ‌లాలు రైత‌న్న‌ల‌కు అందుతున్నాయి. ముఖ్య‌మంత్రి కెసిఆర్ వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా మార్చేందుకు చేస్తున్న కృషి స‌త్ప‌లితాల‌ను ఇస్తోంది. తెలంగాణ వ్య‌వ‌సాయ రంగం వైపు యావ‌త్ దేశం చూసేలా కార్యాచ‌ర‌ణ రూపొందించారు. ప్ర‌భుత్వం ప‌థ‌కాలు రైత‌న్న‌ల‌కు చేయూత‌నిస్తున్నాయి.

టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ముఖ్య‌మంత్రి కెసిఆర్ వ్య‌వ‌సాయ రుణాల‌ను మాఫీ చేశారు. వ్య‌వ‌సాయానికి అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డి సాయం, రైతు ప్ర‌మాద‌వ‌శాత్తూ మృతి చెందితే కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు భీమా, 24 గంట‌ల పాటు నాణ్య‌మైన నిర‌త‌ర క‌రెంటు స‌ర‌ఫ‌రా, గోడౌన్ల నిల్వ సామ‌ర్థ్యంను వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల నిల్వ‌కు అవ‌స‌ర‌మైన మేర‌కు పెంచారు. నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంది.

సాగునీటి వ‌న‌రుల ల‌భ్య‌త పెంపుకోసం కాళేశ్వ‌రం వంటి భారీ ప్రాజెక్టుల‌ను చేప‌ట్టి యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాలువల్లోకి రివ‌ర్స్ పంపింగ్ చేయ‌డం వ‌ల్ల ఆయ‌క‌ట్టు రైతుల‌కు అవ‌స‌ర‌మైన సాగునీటికి ఢోకా ఉండ‌దు. అలాగే ఎస్సారెస్పీ పున‌రుజ్జీవ ప‌నులూ వేగంగా జ‌రుగుతున్నాయి.

*రుణ మాఫీ*
రుణ మాఫీ ద్వారా తెలంగాణ‌లోని 35 ల‌క్ష‌ల 30 వేల మంది రైతులకు ప్ర‌యోజ‌నం క‌లిగింది. 16వేల కోట్ల 12 ల‌క్ష‌ల 4వేల 37 రూపాయ‌లు వ్య‌వ‌సాయ రుణాల బ‌కాయిలను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది.

*రైతు బంధు ప‌థ‌కం*
రైతుల‌కు వ్య‌వ‌సాయ పెట్టుబ‌డి సాయంగా ఎక‌రాకు రూ. 4 వేలు చొప్పున ఖ‌రీఫ్‌, ర‌బీ సీజ‌న్‌కు ముందే ఆర్థిక సాయం చేయ‌డం రైతు బంధు ప‌థ‌కం ఉద్దేశ్యం. ఖ‌రీఫ్ సీజ‌న్‌కు ముందే రాష్ట్రంలోని 58 ల‌క్ష‌ల 16వేల మంది రైతుల‌కు రూ. 5437.56 కోట్లను పెట్టుబ‌డి సాయంగా ప్ర‌భుత్వం అంద‌జేసింది. మ‌ళ్లీ ర‌బీ సీజ‌న్ కు ముందే మ‌ళ్లీ ఎక‌రాకు రూ. 4 వేల చొప్పున అంద‌జేస్తారు.
*రైతు భీమా*
ఆగ‌స్టు 15న ప్రారంభం అయిన రైతు బీమా పథ‌కం కింద రాష్ట్రంలోని 28 ల‌క్ష‌ల మంది రైతుల‌ను బీమా ర‌క్ష‌ణ క‌ల్పించింది. వీరికి ప్రీమియంగా రూ. 636 కోట్ల‌ను ప్ర‌భుత్వం చెల్లించింది. దుర‌దృష్ట వ‌శాత్తూ రైతు మ‌ర‌ణిస్తే వారి కుటుంబ స‌భ్యుల‌కు బీమా ప‌రిహారం అందుతుంది.

*గోడౌన్ల సామ‌ర్థ్యం పెంపు*
2014 వ‌ర‌కు తెలంగాణ‌లో 176 గోడౌన్ లు మాత్ర‌మే ఉండేవి. వీటి నిల్వ సామ‌ర్థ్యం కేవ‌లం 4 ల‌క్ష‌ల 175 వేల మెట్రిక్ ట‌న్నులు మాత్ర‌మే. తెలంగాణ వ‌చ్చాక 364 గోడౌన్ల‌ను నిర్చించింది. త‌ద్వారా 200 శాతం గోడౌన్‌ను నిర్మించ‌బ‌డినాయి. వీటి వ‌ల్ల 18 ల‌క్ష‌ల 30 వేల మెట్రిక్ ట‌న్నుల వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను నిల్వ‌చేసుకునే సౌక‌ర్యం ఏర్ప‌డింది. గ‌తంతో పోల్చితే, 350 శాతం గోడౌన్ల నిల్వ సామ‌ర్థ్యం పెరిగింది.

*24 గంట‌ల క‌రెంటు*
రాష్ట్రంలోని 23 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపుసెట్టులు ఉండ‌గా వీటికి 24 గంట‌ల పాటు నాణ్య‌మైన క‌రెంటును స‌ర‌ఫ‌రా చేస్తోంది.

*నిజామాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలో..*
నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిజామాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలోని రైతాంగానికి వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను ముఖ్య‌మంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ‌రంగం బ‌లోపేతానికి, రైతుల‌కు చేయూత‌నిచ్చే ప్ర‌భుత్వ ప‌థ‌కాలను జిల్లా రైతాంగం ల‌బ్ది పొందేలా చూశారు.

నిజామాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలోని 2.25 ల‌క్ష‌ల మంది రైతుల వ్య‌వ‌సాయ రుణాలు. వీరంద‌రికి రుణ మాపీ ప‌థ‌కం కింద 972.43 కోట్ల రూపాయ‌ల వ్య‌వ‌సాయ రుణాలు మాఫీ అయ్యాయి.

రైతు బంధు ప‌థ‌కం ద్వారా జిల్లాలోని 2.40 ల‌క్ష‌ల మంది రైతుల‌కు 208.19 కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డి సాయంగా ప్ర‌భుత్వం అంద‌జేసింది.

ఇక 1 ల‌క్ష 40 వేల‌ మంది రైతుల‌కు రైతు బీమా కింద 37 కోట్ల‌91 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ప్రీమియంగా ప్ర‌భుత్వం జీవిత బీమా సంస్థ‌కు చెల్లించింది. ఇక రూ. 79.25 కోట్ల‌తో నూత‌నంగా 96 గోడౌన్ల‌ను నిర్మించారు. దీంతో 1.39 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అద‌న‌పు నిల్వ సామ‌ర్థ్యం పెరిగింది.

ఇక 2018 జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి 2 ల‌క్ష‌ల 20 వేల వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ప్ర‌భుత్వం 24 గంట‌ల‌పాటు క‌రెంటు స‌ర‌ఫ‌రా చేస్తోంది.KKP_6659

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *