తెలంగాణలో మొబైల్ పరిశ్రమల హబ్

హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ మొబైల్ కంపెనీల ప్రతినిధులు సీఎం కేసీఆర్ ను సచివాలయం కలిశారు. దేశంలోనే ఎక్కడ లేనటువంటి తొలి జాతీయ సెల్ ఫోన్ల తయారీ పరిశ్రమల సమూహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ కు విన్నవించగా ఆయన వెంటనే ఓకే చెప్పారు. దీనికి అవసరమైన స్థలంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ ను ఈ రంగంలో అగ్రగామిగా నిలుపుదామని ప్రతినిధులు సీఎంకు చెప్పారు.

సీఎంను కలిసిన వారిలో.. జాతీయ సెల్ ఫోన్ అసోసియేషన్ అధ్యక్షడు పంకజ్ మహేంద్ర, కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసీజా, ఫాక్స్ కాన్ ప్రతినిధి యోయో, సెల్ కాన్ ఎండీ వై గురు, వాటర్ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి టోని ఉన్నారు.

రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి, రావిర్యాల్, మహేశ్వరం ప్రాంతాల్లోని భూములను పరిశ్రమ ఏర్పాటుకు ఎంపిక చేశామని, తమకు మౌళిక వసతులు కల్పించాలని సీఎం ను కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *