Breaking News

తెలంగాణలో మరో సర్వే..

telangana Survey-02

-పేదలకు ఇళ్ల పథకం కోసం సర్కారు ప్లాన్
హైదరాబాద్, ప్రతినిధి : అధికారంలోకి వస్తే రెండు బెడ్ రూంలతో ఇళ్లు నిర్మిస్తానన్న కేసీఆర్ హామీ కార్యరూపం దాల్చబోతోంది. అర్హులైన పేదలను గుర్తించేందుకు అధికారులు ఓ సర్వేను నిర్వహించేందుకు పూనుకుంటున్నారు.

సీఎం కేసీఆర్ జిల్లాల్లోకి వెళ్లినప్పడు ప్రతి పేదవారు తమకు ఇళ్లు కట్టించాలని పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రతిపక్షాలు కూడా హామీని నిలబెట్టుకోవాలని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్వేతో అర్హుల జాబితాను రూపొందించేందుకు సర్కారు సన్నద్ధం అవుతోంది.

ఈ గృహనిర్మాణ పథకంలో 34 అంశాలతో అధికారులు దరఖాస్తును రూపొందించారు.సర్వే సమయంలో వీటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో సేకరించాలి. ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ లను అనుసంధానించి పాత వారిని తొలగించడం.. కొత్తవారికి ఇవ్వడం చేస్తారట.. మొత్తం గుత్తగా అయితే 4.61లక్షలు ఖర్చు అవుతుందని.. లబ్ధిదారు నిర్మించుకుంటే 3.58లక్షలు అవుతుందని సర్కారు లెక్క తేల్చింది. దీనికోసం సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తిస్తుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *