తెలంగాణలో మరో భారి పరిశ్రమ కు ఒప్పందం

తెలంగాణలో 200 కోట్ల పెట్టుబడులను పెట్టనున్న అర్పీ సంజీవ్ గోయేంకా గ్రూపు

పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు సమక్షంలో ఒప్పందం
ఈ పరిశ్రమ ద్వారా వెయ్యి మందికి ఉపాది
రైతుల ఉత్పత్తులకు అమ్మకాల కోసం గొయేంకా గ్రూపు సహాకారానికి ఒప్పందం
తెలంగాణలోని పుడ్ పార్కులు, ఇండస్ర్టీయల్ పార్కుల నిర్మాణానికి శ్రేయి ఇన్ ఫ్రా సహకారం
మంత్రి ఒక రోజు కలకత్తా పర్యటన
పలువురు బడా పారిశ్రామిక వేత్తల సమావేశంలో ప్రసంగించిన మంత్రి

తెలంగాణ రాష్ట్రానికి మరొక భారీ పెట్టుబడి రానున్నది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు కలకత్తా నగరంలో పెట్టుబడులు కోసం పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు బడా పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో
200 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టనున్నట్లు అర్పీ సంజీవ్ గోయేంకా గ్రూపు తెలిపింది. సిద్దిపేట జిల్లాలోని తూప్రాన్ వద్ద సుమారు 20 ఎకరాల్లో పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా తమ ఈ –విటా, టూ- యమ్మీ బ్రాండ్లను ఇక్కడి నుంచి తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా గ్రూపు చైర్మన్ సంజీవ్ గొయెంకాతో మంత్రి సమావేశం అయ్యారు. పుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో Goenka group ద్వారా తెలంగాణ రైతులకు సహాకారం అందించాల్సిందిగా మంత్రి కోరారు. ఈ సందర్భంగా తమ ఉత్పత్తులను మార్కెట్ ధరకు అమ్ముకునేలా స్థానిక ప్రాంతాల్లోనే రైతుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకు గోయేంకా గ్రూపు అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను, తెలంగాణ రాష్ర్టానికి ఉన్న బలాలను ( అడ్వాంటేజ్) గుర్తించి 200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన సంజీవ్ గోయేంకా గ్రూపుకు మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా
సుమారుగా వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీ రామారావు తెలిపారు.

ఈ సమావేశం తర్వతా శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ హేమంత్ కనోరియాతో మంత్రి సమావేశం అయ్యారు. మౌళిక వసతుల రంగంలో భారీ పెట్టుబడులు కలిగిన గ్రూప్ తెలంగాణలో చేపట్టేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల గురించి వివరాలను అందజేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చేపడుతున్న మౌళిక వసతులు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం తీసుకోవాలని కోరారు. దీంతోపాటు రాష్ర్ట ప్రభుత్వం పుడ్ పార్కుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందుకోసం ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఇండస్టీయల్ పార్కులకు అర్ధిక సహాకారం అందించే అవకాశాలను పరిశీలిస్తామని హేమంత్ కనోరియా తెలిపారు. మంత్రి సూచన మేరకు త్వరలోనే జపనీస్, చైనీస్, కోరియన్ పెట్టుబడిదారులతో తెలంగాణలో పెట్టుబడుల కోసం ఒక సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు సహాకరిస్తామని తెలిపారు. సాయంత్రం కలకత్తాలోని ప్రముఖ పెట్టుబడిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీ రామారావు తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న సహకారాన్ని వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తమ వినూత్నమైన విధానాల ద్వారా రాష్ట్రంలోని పరిశ్రమలకు, రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ఇచ్చే సహాకారంపైన సుదీర్ఘంగా వివరించారు. ముఖ్యంగా మేక్ ఇన్ తెలంగాణ నినాదం ద్వారా మ్యాన్యూఫాక్చరింగ్ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వస్తై సంపూర్ణ సహాకారం అందిస్తామని హమీ ఇచ్చారు. ఈ పర్యటనలో మంత్రి వేంట పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.

kt ramarao     kt ramarao 1

 

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *