తెలంగాణలో భారీ వర్షాలు

heavy%20rain%20Hyderabad%20October%2023_0_0_0_0_0

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకస్మిక వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ , ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు  పట్టణాలు, గ్రామాలు జలమయమయ్యాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తరలిస్తున్నారు.

భారీ వర్షాలు పడడంతో వేసవి వేడి పోయి చల్లదనం వచ్చేసింది. జనం ఈ వాతావరణంతో సేదతీరుతున్నారు. రైతులు మాత్రం ఈ అకాల వర్షాలకు పంటలు నాశనమై ఇబ్బందులు పడుతున్నారు. చత్తీస్ ఘడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు నెలకొని ఉన్న అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వాతావరణం ఇలానే ఉండనుంది. మొత్తానికి ఎండాకాలంలో చల్లటి వాతావరణం

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *