
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో ఓ పాఠశాల భవనం గోడ కూలింది.. భారీ వర్షాలకు హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యాయి.. ఇక తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కరీంనగర్ లో ఈరోజు ఉదయం 8.30 నుంచి 9.15 వరకు భారీ వర్షం కురిసింది. కరీంనగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి.. డ్రైనేజీలు పొంగిపొర్లాయి..