Breaking News

తెలంగాణలో బీజేపీ ఓడుతోంది ఇందుకేనట..

7382_BJP

– బీజేపీలో కిషన్ రెడ్డిపై అసమ్మతి

హైదరాబాద్ : వరుసగా తెలంగాణలో జరుగుతున్న ఓటములకు కిషన్ రెడ్డియే బాధ్యుడని హైదరాబాద్ పరిధిలో ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. దీంతో రాష్ట్ర బీజేపీలో ఇప్పుడు కలకలం రేగుతోంది.. కిషన్ రెడ్డి బీజేపీని తెలంగాణలో భ్రష్టు పట్టిస్తున్నాడని.. రెడ్డి సామాజికవర్గానికే అందలం ఎక్కిస్తూ అన్ని కీలక పదవులు కట్టబెట్టాడని రాజాసింగ్ విమర్శించారు. హైదరాబాద్ జిల్లా అద్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుల వరకు అందరూ రెడ్డిలేనని ఆరోపించారు.

వరంగల్ ఉప ఎన్నిక కానీ ఇంకేదైనా కానీ తెలంగాణలో బీజేపీ గెలవకపోవడానికి కిషన్ రెడ్డినే కారణమని రాజాసింగ్ ఆరోపించారు. ఈ విమర్శలు కిషన్ రెడ్డి వ్యతిరేకులకు అస్త్రాలుగా మారాయి. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ అద్యక్షుడు అమిత్ షాకు కిషన్ రెడ్డి పై కొందరు ఫిర్యాదు చేయడానికి వెళుతున్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో ముసలం మొదలైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *