తెలంగాణలో పెట్టుబడులకు చైనావోళ్లు

kcrr

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ చైనా పర్యటన ఫలఫ్రదం అయినట్టే కనపడుతోంది.. ప్రతిష్టాత్మకమైన తెలంగాణలోని పథకాలకు పెట్టుబడులు పెట్టేందుకు చైనా సంస్థలు ముందుకొచ్చాయి..  ప్రాజెక్టులు , వంతెనలు, సొరంగాలు, బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు  పలు చైనా సంస్థలు అంగీకరించాయి.

తెలంగాణ సర్కారు హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మించతలపెట్టిన దేశంలోనే అతిపెద్ద టవర్ ను బ్యాంక్ ఆఫ్ చైనా నిర్మించేందుకు ముందుకొచ్చింది. దీనికయ్యే ఖర్చులో 85 శాతం  భరిస్తానని.. టీ ప్రభుత్వం 15 శాతం భరిస్తే చాలని చెప్పింది.

చైనా కంపెనీల ప్రతినిధులు శుక్రవారం కేసీఆర్ తో సమావేశమై నిర్మాణ రంగంపై తమ పెట్టుబడులపై చర్చించారు. పలు మోడళ్లను ప్రతిపాదనలను వారు సీఎం కేసీఆర్ కు అందజేశారు. త్వరలో నే విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ఓకే చెబుతామని కేసీఆర్ వారికి బదులిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *