Breaking News

తెలంగాణలో పాలకులే.. ప్రజల సేవకులు

001

సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పాలన ఓ రకంగా ఉండేది… ప్రభుత్వాధినేతలు సీఎం , మంత్రులు ఆదేశించేవారు.. కిందిస్థాయి అధికారులు, సిబ్బంది పనిచేసేవారు .. కానీ తెలంగాణ ఉదయించిన వేళ విశేషం ఏమో గానీ మంత్రులు , అధికారులు ఆదేశాలు జారీ చేయడం లేదు.. వారే పనులు చేస్తున్నారు చేయిస్తున్నారు.. దగ్గరుండి రోజుల తరబడి ప్రజలకు చేరువవుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇంతటి అద్భుత పరిపాలనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టగా.. కేబినెట్ మంత్రులు సీఎం ఆదేశాలను పాటిస్తూ ముందుకెళ్తున్నారు.

తెలంగాణ పుష్కరాల్లో తెలంగాణ ప్రభుత్వ అసలు స్వరూపం బయటపడింది.. నిజామాబాద్ మొదలు ఖమ్మం జిల్లా వరకు కూడా మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. పుష్కర భక్తులకు ఏ లోటు రాకుండా దగ్గరుండి అధికారుల్ని సమన్వయం చేస్తూ పనులు చేసుకుంటున్నారు.

002

నిజామాబాద్ లో మంత్రి పోచారం అన్నదానం చేయిస్తూ స్వయంగా జనంతో కలిసి బోజనాలు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో మంత్రులు హరీష్, ఈటెలలు బైక్ పై వెళ్లి ట్రాఫిక్ క్రమబద్దీకరించి భక్తుల కష్టాలు తీర్చారు. ఇక వరంగల్ లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వరంగల్ ఘాట్ ల వద్ద ఉండి మరీ భక్తుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం సైతం ఎవరూ వచ్చినా అపాయింట్ మెంట్ ఇస్తూ తొందరగా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పుష్కరాలు జరుగుతున్న 12 రోజులు భద్రాచలంలోనే ఉండి అధికారులతో కలిసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు..

మరక అంటకుండా పుష్కరాలు ముగించాలన్న సీఎం కేసీఆర్ దృక్పథాన్ని మంత్రులు పాటిస్తున్నారు. నవ తెలంగాణలో పాలకులే సేవకులుగా మారి కొత్త పంథాను సృష్టించారు. సమైఖ్యరాష్ట్రంలో ఎప్పుడు ఇలా జరగలేదు.. పాలన, ప్రభుత్వంలో ఇంతలా మార్పు వచ్చిన సందర్భం చరిత్రలో అరుదుగా కనిపిస్తుంది.. ఇలా చేసుకుంటూ పోతూ వచ్చే 2019 ఎన్నికల్లో కేసీఆర్ ఆశించిన 100 సీట్లు గ్యారెంటీగానే కనపడుతోంది.. ప్రతిపక్షాలు లేని తెలంగాణను చూసిన చూడొచ్చోమో.. అంతలా ప్రభుత్వ పనితీరు ఉందంటే అతిశయోక్తి కాదు..

003

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *