తెలంగాణలో పసుపు జెండానా.?

chandrababu naidu

తెలంగాణలో పసుపు జెండా ఎగిరేస్తానన్నారు బాబు గారు.. అవును తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడ్డ రెండు కళ్ల చంద్రబాబు తెలంగాణపై సవతితల్లి ప్రేమ కనబర్చిన అదే బాబు గారు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తానంటున్నారు. తెలంగాణలో అదీ ఆంధ్రాపార్టీ అధికారంలో వస్తుందనుకుంటే పొరపాటే..

టీఆర్ఎస్ పార్టీ దెబ్బకు తెలంగాణ అన్ని జిల్లాల్లో పార్టీ తుడుచుపెట్టుకుపోయింది. ఒక్క హైదరాబాద్ లో తప్ప మిగితా జిల్లాలో టీడీపీ ఊసే లేదు. అందరు పెద్ద నాయకులు టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఉన్న ఒక్కరిద్దరు కూడా పార్టీ మారుదామనుకున్నా కొన్ని ఇబ్బందులు వల్ల ఉంటున్నారు. ఈనేపథ్యంలో బాబు తెలంగాణలో అధికారం అసాధ్యమన్నది చోటా మోటా నాయకులనుంచి ప్రజల వరకు అందరూ అనుమానిస్తున్నారు. మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాననడం కేవలం తెలంగాణలో తుడిచిపెట్టుకుపోతున్న క్యాడర్ ను కాపాడుకోవడానికే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *