
` -KTPP-2లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
వరంగల్ : వరంగల్ జిల్లా భూపాలపల్లి వద్ద గల కాకతీయ థర్మల్ విద్యుత్కేంద్రం-2లో ఆదివారం విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. బాయిలర్ ను వెలిగించి శ్రీకారం చుట్టారు. ఒకటి రెండు రోజుల్లో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి నెలరోజుల్లో వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.
కాగా తెలంగాణ ఏర్పాటు తర్వాత మొట్టమొదటి విద్యుత్ కేంద్రం ఇదే.. ఇది ప్రారంభంమైతే తెలంగాణలో చిరస్థాయిగా నిలిచిపోతుంది..