
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు తీపి కబురునందించింది. బుధవారం ఆ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం 3783 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 770 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. వీటికి బీటెక్ సివిల్ గ్రాడ్యూయేట్స్ అర్హులని తెలిపారు. పరీక్ష ఆన్ లైన్ పద్ధతిలో మొదటిసారి ప్రయోగాత్మకంగా నిర్వహిస్తారు.
రాత పరీక్షకు అప్లై చేసుకోవడానికి చివరి తేది సెప్టెంబర్ 3 . పరీక్ష సెప్టెంబర్ 20న ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఆన్ లైన్ లో పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు రెండు వారాల గడువు ఇచ్చారు. పూర్తి వివరాలు టీఎస్ పీఎస్ సీ వెబ్ సైట్ లో చూడవచ్చు..