
తెలంగాణ ఏర్పడ్డాక ఉనికి చాటుకుంటూ పలు విధ్వంసాలకు పాల్పడుతున్న మావోయిస్టులకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ జిల్లాలో గోవిందరావు పేట మండలం మొట్లగూడెంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మృతి చెందారు. ఇందులో ఓ ఎంటెక్ విద్యార్థిని కూడా ఉండడం విశేషం.. కరీంనగర్ , ఖమ్మం, వరంగల్ దళం (కేకేడబ్ల్యూ) కొద్ది రోజులుగా ఈ మూడు జిల్లాల్లో విధ్వంసాలకు పాల్పడుతోంది..
పోలీసులు వీరి కదలికలను గమనించి వరంగల్ జిల్లాలో కూంబింగ్ నిర్వహించగా 18 మంది గల మావోయిస్టుల గుంపు తారసపడింది.. దీంతో కాల్పులు మొదలు కాగా ఇద్దరు మరణించారు. ఇందులో వరంగల్ నగరం వడ్డేపల్లికి చెందిన ఎంటెక్ విద్యార్థిని శృతి.. ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలకు చెందిన విద్యాసాగర్ రెడ్డి ఉన్నారు.