తెలంగాణలో టీడీపీ ఖేల్ ఖతం.. దుకాణం బంద్..

వరుస ఎన్నికల గెలుపుతో టీఆర్ఎస్ కారు జోరుమీదుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్, ఫరవాలేదనపిస్తోంది. ఇక పచ్చపార్టీ టీడీపీ సైకిల్ కుదేలయ్యింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా గుండు ‘సున్నా’లేసుకుంది. అచ్చంపేటలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడి పోటీచేసినా కనీసం ఒక్కసీటు కూడా గెలుచుకోకుండా క్లీన్ స్వీప్ చేసేసింది టీఆర్ఎస్ సర్కారు..
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకే ఒక్క డివిజన్ గెలుచుకున్న టీడీపీ .. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత పెద్ద నగరమైన వరంగల్ లో, ఖమ్మంలో సైతం ఒక్కటంటే ఒక్క సీటు గెలవకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలంగాణలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. టీడీపీ ఈ రెండు చోట్లా గెలుపు దరిదాపులకు రాలేదు.. అధికార టీఆర్ఎస్ ప్రభంజనం ముందు టీడీపీ కొట్టుకుపోయిందనే చెప్పాలి.

కాగా ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ మనుగడ కష్టమే.. ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ ((జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే), అరికెపూడి గాంధీ(శేర్ లింగం పల్లి ఎమ్మెల్యే) దాదాపు టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. దీంతో ఇప్పుడు టీడీపీకి ముగ్గురే ఎమ్మెల్యేలు మిగిలారు. అందులో ఓటుకు నోటు కేసులో ప్రదాన నిందుతుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాగా.. రెండో నిందితుడుగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య, ఇక టీడీపీతో అంటీముట్టనట్టు ఉంటున్న బీసీ సంఘం నేత ఆర్ క్రిష్ణయ్య ఏ పార్టీలో ఉన్నాడో ఎవరికి తెలియదు.. మొత్తంగా 15 మంది సభ్యులు గెలిచిన టీడీపీ సంవత్సరంన్నర తిరిగేసరికి ఆ పార్టీలో ముగ్గురే మిగిలారు. దీంతో దాదాపు తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పాలి. ఇక ఆ పార్టీని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని పార్టీ మారిన ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు.. మొత్తానికి తెలంగాణలో టీడీపీ ఖేల్ ఖతం అయ్యింది.. దుకాణం బంద్ అయినట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *