
హైదరాబాద్ : ఉమ్మడి ఏపీలో ఉన్న జోనల్ విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ నివేదించారు. తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడిన తరుణంలో ఇక్కడ జోనల్ విధానం అమలుచేయాలా వద్దా అనే దానిపై సీఎం కేసీఆర్ సీఎస్ కు బాధ్యతలు అప్పగించారు. ఆయన వివిధ సంఘాలు, మేధావులు, న్యాయనిపుణులతో చర్చించి జోనల్ విధానం కొనసాగించాలని సీఎం కేసీఆర్ నివేదిక సమర్పించారు. దీనిపై ఒకటిరెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.