తెలంగాణలో జాతీయ ట్రాన్స్ పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేయండి

స్మాట్ రవాణా కోసం 250 కోట్ల నిధులివ్వండి

రోడ్డు భద్రత ..ప్రాణ రక్షణ జాతీయ విధానంగా అనుసరిద్దాం

ఢిల్లీలో కేంద్ర మంత్రి గట్కరితో మంత్రి మహేందర్ రెడ్డి

రాష్ట్ర రోడ్డు భద్రత విధానాలను ప్రశంసించిన గట్కరి

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయి ట్రాన్స్ పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేయాలని రవాణాశాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణ మంత్రి నితిన్ గట్కరితో ఆయన ఎంపీ బీబీ పాటిల్, రవాణా శాఖ కమీషనర్ సునీల్ శర్మ, ట్రాఫిక్ డీజీ కృష్ణప్రసాద్ తదితరులతో కలిసి భేటీ అయ్యారు. దేశంలో, రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ అమాయకులు ప్రాణాలు కోల్నోతున్న తరుణంలో ప్రమాదా నివారణ, రోడ్డు భద్రతను జాతీయ విధానంగా మార్చుందుకు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కోన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం జాతీయ పోలీస్ అకాడమీ తరహాలో పరిశోధన కోసం జాతీయ ట్రాన్స్ పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేయాలని, అందుకు 60 కోట్ల నిధులు ఇవ్వాలని, తాము సహాకరిస్తామని చెప్పారు. రోడ్డు పరిశోధనలు, అవగాహన, ప్రణాళికా రచన కోసం 250 కోట్ల నిధులు అందిచాలని వినతీ ప్రతం అందించారు.ప్రమాదాల నివారణలోభాగంగా విద్యార్థులు, యువత, ప్రజలకు అవగాహన కోసం విద్యా సంస్థలలో రోడ్ సేప్టీ క్లబ్ ల ఏర్పాటుకు 20 కోట్ల నిధుల అందించాలని కోరారు. ప్రమాదాల నివారణకు అవసరమౌన ఉత్తమ డ్రైవర్లను తీర్చిదిద్దంటం కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో సిరిసిల్లాలో ఏర్పాటు చేస్తున్న డ్రైవింగ్ స్కూల్ తరహాలో అన్ని జిల్లా కేంద్రాలలోని ఐటీఐలలో లైట్, హైవీ వాహన డ్రైవింగ్ శిక్షణ కోసం 60 కోట్లనిధులు కేటాయించాలన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2592 కిమీ మేరకు 16 జాతీయ రహదారులుండగా 44, 3152 కిమీ రాష్ట్ర రహదారులలో 31, 22 వేల కిమీ ప్రాంతీయ రహాదారులలో మొత్తంగా 137 ప్రమాద పూరిత( బ్లాక్ స్పాట్) ఉన్నాయని వీటిని బాగుచేసేందుకు 90 కోట్ల నిదులు ఇవ్వాలన్నారు. ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత నిబంధనలను అతిక్రమించే వారి నియంత్రించటం తో పాటు ప్రమాద బాధితులకు సహకారం కోసం వాహనాలు, డాటా బేస్ సిస్టమ్ కోసం 30 కోట్లు అందించాలన్నారు. అలాగే డ్రైవర్లకు రెస్ట్ రూమ్ లు తదితరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. కేంద్రం రాష్ట్రంలో రవాణా శాఖ అమలు పరుస్తున్న ఎం వాలెట్ లాంటి విధానాలను, క్యాష్ లెస్ విధానాలను గట్కరీ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో దేశంలోని అన్ని రాష్ట్రాలు రోడ్డు భద్రతకు కృషి చేస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని గట్కరి మంత్రి మహేందర్ రెడ్డిని అభినందించారు. జేటీసీ వెంకటేశం, ఓఎస్డీ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

About The Author

Related posts