తెలంగాణలో ఖాళీ ఉద్యోగాలు 1,07,734

etela

-ప్రతిపక్షాల డిమాండ్ సమాధానం చెప్పిన మంత్రి ఈటెల -ఉద్యోగాలపై ప్రశ్నించిన ప్రతిపక్షాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉద్యోగాల అంశంపై దద్దరిల్లింది. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. ఖాళీల భర్తీపై స్పష్టమైన షెడ్యుల్ ప్రకటించాలని.. కమలనాథన్ కమిటీపై భారం వేసి ఉద్యోగాలు కల్పించకుండా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని విమర్శించారు.

ఖాళీల భర్తీ పై ప్రభుత్వం తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తోందని బీజేపీ నేత లక్ష్మన్ ఎద్దేవా చేశారు.  రిక్రూట్ మెంటును ఉర్దూలో కూడా నిర్వహించాలని ఎంఐఎం నేత అకర్బుద్దీన్ సభలో డిమాండ్ చేశారు.

కాగా దీనిపై మంత్రి ఈటెల రాజేందర్  మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం లక్షా 7 వేల 734 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజన చేశాక మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *