తెలంగాణలో కేసీఆర్ ది కుటుంబ పాలన

utham

తెలంగాణ రాష్ట్రంలో అరశాతం కూడా లేని కులం వారే 40 శాతం మంత్రి పదవులు అనుభవిస్తున్నారని.. రాష్ట్రంలో అధికార పెత్తనం అంతా కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు అల్లుడిదేనని మండిపడ్డారు పీసీసీ నూతన అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యధ్యక్షుడిగా నియమితులైన మల్లు భట్టి విక్రమార్కలు ఆదివారం గాంధీ భవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సభలో ఉత్తమ్ మాట్లాడారు. మన తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలు పోరాడారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఇలాంటి తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణ సాధించినట్టు ఫోజు కొడుతున్నారు. నిజానికి తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ కు రూపాయి భాగస్వామ్యం లేదన్నారు. నిజానికి టీఆర్ఎస్ ఎన్ని ధర్నాలు, తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ నే నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *