Breaking News

తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ కాబోతోందా..?

jana-reddy-d-srinivas

తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ కాబోతోంది. యాదృశ్చికంగా కాంగ్రెస్ సీనియర్లు టీఆర్ఎస్ బాటపడుతున్నారు. దీంతో టీడీపీ లాగే కాంగ్రెస్ కూడా తెలంగాణ లో ఖాళీ కాబోతోంది. ఈ అయాచిత వరాన్ని టీఆర్ఎస్ అప్పనంగా అందుకుంటోంది.

నేడో రేపో కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్  టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఇక నిన్న రాత్రి జానారెడ్డి ని కరీంనగర్ ఎంపీ వినోద్ కలిసి టీఆర్ఎస్ లో చేరాలని ఒత్తిడి చేశారు. ఆయన ఇందుకు సరేనన్నారని సమాచారం. దీంతో ఏకకాలంలో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లు టీఆర్ఎస్ లో చేరుతుండడంతో సంచలనం రేపబోతోంది..

మొత్తానికి అధికార టీఆర్ఎస్ కు విపక్ష కాంగ్రెస్ లో లుకలుకలు బాగా కలిసి వస్తున్నాయి. టీఆర్ఎస్ కోరకుండానే దిగ్గజ నాయకులు వచ్చి చేరుతుండడంతో వచ్చే ఎన్నికలకు టీఆర్ఎస్ బలోపేతం కానుండగా.. కాంగ్రెస్ డీలా పడబోతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *