
తెలంగాణలో ఉద్యోగాల ఖాళీల వివరాలు ఆయా శాఖలు వెల్లడించాయి. 70శాఖల నుంచి దాదాపు 52వేల ఖాళీ పోస్టులు వివరాలు ఆర్థిక శాఖకు చేరాయి. రాష్ట్ర స్థాయి పోస్టులను ఇందులో మినహాయించారు. అవికాకుండానే 52 వేల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారో వెల్లడించేందుకు పదిరోజుల సమయం పట్టవచ్చని తెలిసింది. తెలంగాణలో ఉద్యోగుల నియామక ప్రక్రియలో మలిదశ మొదలుకానుంది. ప్రస్తుతం భర్తీ చేసే పోస్టులనే ఆయా శాఖలు ఆర్థిక శాఖకు తెలిపాయి.