Breaking News

తెలంగాణలో ఈఎస్ఐ రోగులకు మందులు ఫ్రీ

iithcECOTTOPCCICEEVCQ

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు, కిందిస్థాయి ఉద్యోగులకు మరో వరం ప్రకటించింది. ఇన్నాళ్లు సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆస్పత్రి రోగులకు ఓ మోస్తారు మందులు లభించేవి. ధీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్, మూత్రపిండాలు, కాలేయ తదితర మేజర్ రోగాలకు మందులు లభ్యం కాలేదు. దీంతో రోగులు ఎక్కడెక్కడో తిరిగి భారీగా ఖర్చు పెట్టారు.

ఈ కష్టాలన్నీ చూసిన ఈఎస్ఐ కొత్త సంచాలకురాలు దేవికారాణి రోగుల కష్టాలను చూసి కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డికి విన్నవించారు. దీంతో ఆయన కేసీఆర్ తో మాట్లాడి ప్రతిపాదనలు ఓకే చేయించారు. దీంతో ఈఎస్ఐ ఆస్పత్రిలోని బీ2 క్వార్టర్ లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మంత్రులు నాయిని, పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్ లు ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. దీంతో రోగుల కష్టాలు తీరనున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *