తెలంగాణలో అడవి జంతువులు కనుమరుగు

2014-09-24_181637_Gaur

తెలంగాణ జీవవైవిధ్య మండలి రాష్ట్రంలో అంతరించిపోతున్న జీవజాతుల లెక్క తేల్చింది.. వాటిల్లో తోడేలు, అడవి కుక్క, గుంట నక్క, పులి, చిరుతపులిలు దాదాపు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయట.. పునుగుపిల్లి, నీటిపిల్లి, నీటి కుక్క, ఎలుగుబంటి, దుప్పులు, అడవి దున్న పోతే అయితే ఉనికినే కోల్పోతున్నాయట.. ఈ నివేదికలో తెలంగాణలో అంతిరించిపోతున్న వృక్ష జాతుల వివరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం పొందుపరిచింది..  బిల్లుడు చెట్టు, ఇరుగుడు చెట్టు, మారేడు కొమ్మలు, నక్షత్రాల మొక్క, చుక్కదుంప రాబందు రకాలు న్నాయట..  27రకాల పక్షి జాతులు సైతం అంతిరించిపోతున్నాయట..

జంతువుల వేట.. జీవజాతుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.. వీటిని సంరంక్షించకపోతే భవిష్యత్తులో ఇవి కనుమరగయ్యే పరిస్థితులున్నాయి. తెలంగాణలో ఒక్క ఆదిలాబాద్ లోనే పలు జంతువుల ఆనవాళ్లు ఉన్నాయి. ఖమ్మంలో కూడా కొంత మేర ఉన్నాయి.. మిగతా జిల్లాలో వాటి జాడే లేదు.. వీటిని పరిరక్షించకపోతే మన పిల్లలకు వీటిని టీవీల్లో, పుస్తకాల్లో చూపించాల్సిందే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *