Breaking News

తెలంగాణలోనే భారీ విద్యుత్ కేంద్రాలకు స్థలం ఆమోదం

Scotland-Wants-to-Build-Nuclear-Power-Plants-2

నల్గొండ : తెలంగాణలోని నల్గొండ జిల్లాకు మహర్దశ పట్టింది. అక్కడి దామెరచర్ల మండలంలో భారీ విద్యుత్ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.. అక్కడి అటవీ భూమిని విద్యుత్ కేంద్రాల నిర్మాణాల కోసం కేటాయించాలని కేంద్రానికి విన్నవించింది. అది ఇప్పుడు నెరవేరింది. దామరచర్లలోని 4334 ఎకరాలను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ప్రతిగా రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖకు భూములు కేటాయించింది.

కాగా దామెర చర్ల మండలంలో తెలంగాణలోని భారీ విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరుగబోతోంది. ఎన్టీపీీసీ 4000 మె.వా విద్యుత్ కేంద్రంతో పాటు జెన్ కో ప్లాంట్ ల ఏర్పాటు చేయనున్నారు. దీంతో భారీగా ఉద్యోగాలు అవకాశాలతో పాటు నల్గొండ పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది. విద్యుత్ కేంద్రాల్లో మౌళిక సదుపాయాల కోసం  తెలంగాణ ప్రభుత్వం 198 కోట్ల రూపాయలను ఆదివారం విడుదల చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *