తెలంగాణలోని పురపాలికల్లో హారిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కేటీఆర్

 

  • జూన్ మాసంలో పెద్ద ఎత్తున అవగాహాణ సదస్సులు
  • అన్ని మున్సిపల్ కమీషనర్లతో ప్రత్యేక సమావేశం
  • పట్టణాల్లోని రెసిడెంట్ వేల్పేర్ అసోషియేషన్లతో  అధికారుల సమావేశాలు
  • ముందే మొక్కలు నాటేందుకు అవసరం అయిన స్దలాల ఎంపిక
  • ప్రజల వద్దకే వీకేంద్రీకరణ పద్దతిలో మొబైల్ వాహానాల్లో మెక్కల పంపిణీ
  • రాష్ర్టంలోని అన్ని ఐలాల్లో( పారిశ్రామిక వాడల్లో) పెద్ద ఎత్తున హారిత హారం
  • పార్కులు, డంపు యార్డులు, శ్మశనాలు, చెరువుల చుట్టు మెక్కలు నాటడడంపైన ప్రత్యేక దృష్టి

 

తెలంగాణలోని పురపాలికల్లో హారిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కెటి రామారావు పిలుపునిచ్చారు. వర్షకాలం సమీపిస్తుండడంతో పట్టణాల్లో హారిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరం అయిన చర్యలపైన మంత్రి ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖాధికారులు, పురపాలక శాఖ ముఖ్యాధికారులు ఈ సమావేశానికి హజరయ్యారు. జూలై రెండవ వారంలో పెద్దఏత్తున హారిత హారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు పిసిసియప్ పికె  జా, హారిత హారం కార్యక్రమ ఒయస్డీ ప్రియాంక వర్గీస్ లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ర్టంలోని పట్టణ ప్రాంతాల్లో హారిత హారం కార్యక్రమ అమలు కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ జూన్ మాసంలో హరిత హారం కోసం పెద్ద ఎత్తున ప్లానింగ్ చేయాలని నిర్ణయించారు. ముందుగా అన్నీ మున్సిపల్ కమీషనర్లతో ప్రత్యేక ఒరియేంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సిడియంఏ శ్రీదేవికి మంత్రి అదేశాలు జారీ చేశారు. మెత్తం ఎన్ని మెక్కలు నాటుతారు, వాటిని ఎఏ ప్రాంతాల్లో నాటుతారు అనే స్థలాలు ఏంపిక చేయాలన్నారు. ఈ విషయంలో స్ధానిక రెవెన్యూ సిబ్బంది సహాకారం తీసుకోవాలన్నారు. రాష్ర్టంలోని ఇతర పురపాలికలతోపాటు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హారిత హారం కార్యక్రమాన్ని హెచ్ యండిఏ, జియచ్ యసిలు పూర్తి భాద్యత తీసుకుని ఇతర శాఖలతో ఇప్పటి నుంచే సమన్వయం చేసుకోవాలన్నారు. నగరంలోని పార్కులు, ఖాళీ స్థలాల ఎంపిక చేయడంతోపాటు అక్కడ ఎన్ని మొక్కలు నాట వచ్చో ముందే ఒక అంచనాకు రావాలని అధికారులను మంత్రి కోరారు. నగరంలోని రెసిడెంట్ వెల్పేర్ అసోషియేషన్లతో జోనల్, సర్కిల్ వారీగా హారిత హారంపైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణాల్లో ఏఏ ప్రాంతాల్లో మొక్కల పంపీణీ జరుగుతుందో ప్రజలకు తెలపడంతోపాటు డిసెంట్రలైజేషన్ పద్దతిన మొక్కల పంపీణీకి అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయాలన్నారు.  నగరంలోని చెరువుల చుట్టు మొక్కలు నాటేందుకు సాగునీటి శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి పనిచేయాలని జియచ్ యంసి, హెచ్ యండి ఏ అధికారులకు అదేశాలు జారీ చేశారు. ఈ హారిత హారం ద్వారా చెరువులకు నేచురల్ ఫెన్సింగ్ వేసేలా మొక్కలను నాటాలన్నారు. దీంతోపాటు పట్టణాల్లోని శ్మశాన వాటికల్లో మొక్కలు నాటడంతోపాటు డంప్ యార్డుల్లో సువాసనలు వెదజల్లే మొక్కలు నాటేందుకు ప్రయత్నించాలన్నారు. నగరంలోని అవుటర్ రింగ్ రోడ్డుతోపాటు ఏంపిక చేసిన ప్రాంతాల్లో అర్బన్ ఫాసెస్ట్ బ్లాకుల్లోనూ పెద్దఎత్తున ప్రణాళిక బద్దంగా చెట్లు నాటనున్నట్లు అధికారులు మంత్రి తెలిపారు.

రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న సూమారు వంద పారిశ్రామిక వాడలు (ఐలా)ల్లోనూ హారిత హారం అమలుపైన ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. నిబందనల ప్రకారం కనీసం 30 శాతానికి పైగా పచ్చదనం ఉండాలన్న నిబందన మేరకు అయా కంపెనీలు మొక్కలు నాటేల చూడాలని,  ఈ విషయంలో టియస్ ఐఐసి పూర్తి భాద్యత తీసుకోవాలని మంత్రి సంస్ద యండి వెంకట నర్సింహా రెడ్డిని కోరారు.

ఈ సమావేశంలో పిసిసియప్ పికె  జా, హారిత హారం కార్యక్రమ ఒయస్డీ ప్రియాంక వర్గీస్, సిడియంఏ, జియచ్ యంసి, హెచ్ యండిఏ, ఫారెస్ట్, టియస్ ఐఐసి అధికారులు, నగర మేయర్ బొంతు రామ్మోహాన్ తదితరులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *