Breaking News

తెలంగాణకు విస్తరిస్తున్నారు..

maoist-m

వరంగల్ లో ఇద్దరు నక్సలైట్ల ఎన్ కౌంటర్.. ప్రతిగా  ఆదిలాబాద్ కౌటాలలో ఒక ఇన్ఫర్మార్ ను నక్సలైట్లు కాల్చిచంపారు..  దీనికి ప్రతిగా ఆదిలాబాద్ లో మళ్లీ నిన్న ఎన్ కౌంటర్ ఇద్దరు మృతి.. ఇప్పుడు ఖమ్మం జిల్లా చర్లలో ఆరుగురు టీఆర్ఎస్ నేతలను నక్సలైట్లు అపహరించారు.. మొత్తానికి ఏపీనుంచి విడిపోయిన తరువాత తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలయ్యింది..

మావోయిస్టు అధికార ప్రతినిధిగా జగన్ లేఖ రాశారు. ఖమ్మంలో ఆరుగురి టీఆర్ఎస్ నేతలు బతికి బట్టకట్టాలంటే ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు కూంబింగ్ ఆపాలని.. బూటకపు ఎన్ కౌంటర్లు చేయద్దని హెచ్చరించారు. దీంతో మళ్లీ తెలంగాణలో మావోల ప్రభావం మొదలైంది.. రాష్ట్రం ఏర్పడ్డాక ఇక మావోల కదలికలు పెరగడంపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *