తెలంగాణకు విద్యుత్ కోసం ఒప్పందాలు

01curent

ఎన్టీపీసీ, సింగరేణి కాలరీస్ తో తెలంగాణ ట్రాన్స్ కో సోమవారం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో  ట్రాన్స్ కో సీఎండీ డి. ప్రభాకర్ రావు, ఎన్టీపీసీ జీఎంలు ఆనంద్, ఖర్,మేనేజర్లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. దీని ప్రకారం రామగుండంలోని ఎన్టీపీసీ ప్లాంట్ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణ ట్రాన్స్ కో డిస్కంలు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి..సెంట్రల్ ఈఆర్సీ సిఫారసుల ప్రకారం రేటు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేస్తామని అంగీకారం కుదుర్చుకున్నారు..

అలాగే సింగరేణి కాలరీస్ సంస్థ నిర్మిస్తున్న జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి ఏప్రిల్ నుంచి 1200మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు  ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, సింగరేణి సీఎండీ శ్రీధర్ లు ఒప్పందాలు చేసుకున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *