తెలంగాణకు మరో సెల్ ఫోన్ కంపెనీ 

తెలంగాణకు సెల్ ఫోన్ రంగ పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయి.. దక్షిణాదిలో ఏపీ, తెలంగాణల్లోనే సెల్ ఫోన్ పరిశ్రమలు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.. ఎక్కువగా హైదరాబాద్, తిరుపతిలోని శ్రీసిటీ సెజ్ ల్లో తమ పరిశ్రమలను నెలకొల్పుతున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ విప్లవం కొనసాగుతున్న వేళ తెలుగు రాష్ట్రాలు ఆ అవకాశాలను రెండు చేతుల అందిపుచ్చుకుంటన్నాయి.. కేసీఆర్, చంద్రబాబులు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలోనే పెద్ద పరిశ్రమలైన మైక్రోమాక్స్, సెల్ కాన్ లు ఇప్పటికే తయారీ పరిశ్రమలను నెలకొల్పాయి..

ఇప్పుడు  కెనడా కంపెనీ అయిన డేటా విండ్ కూడా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్డ్ దగ్గరున్న సెజ్ లోని 2 ఎకరాల్లో సెల్ ఫోన్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.. కాగా ఇప్పటికే హైదరాబాద్ లో గూగుల్, అమేజాన్, ఉబెర్ లు తమ ప్రధాన కేంద్రాలను దేశంలోనే ఇక్కడే ఏర్పాటు చేశాయి.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేస్తున్న ఆకాష్ ట్యాబ్లెట్లను అందించే డేటావిండ్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయడంతో ఇక్కడ యువతకు పెద్దఎత్తున ఉపాధి లభించనుంది. సెల్ ఫోన్ తయారీ హబ్ గా మారనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *