
తెలంగాలో నిరంతర విద్యుత్ సరఫరా పథకంకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందకు కేంద్ర విద్యుత్ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇంధన శాఖకు రాసిన లేఖ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 24 గంటల విద్యుత్ సరఫరాకు ఉన్న సానుకూలాంశాలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణకు 24 గంటల కరెంటుపై చర్చించేందుకు ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రెడ్డిలతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా గ్రిడ్, నిధులు, ఇతర సహకరించాల్సిందిగా కేంద్ర కార్యదర్శిని సీఎస్, ట్రాన్స్ కో సీఎండీ వినతిపత్రం సమర్పించారు. మరో 2500 మెగావాట్లు లోటు ఉందని.. కేంద్రం విద్యుత్ ఇస్తే నిరంతర విద్యుత్ ఇస్తామని తెలిపారు. దీనిపై నివేదిక కోరిన కేంద్ర కార్యదర్శి త్వరలోనే విద్యుత్ ఇచ్చేందుకు సహకరించి నిరంతర విద్యుత్ కు తోడ్పడతామన్నారు.