
చత్తీస్ ఘడ్ తో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందం ఖరారైంది.. నిన్న సీఎం కేసీఆర్ సమక్షంలో చత్తీస్ ఘడ్, తెలంగాణ విద్యుత్ అధికారులు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు..
చత్తీస్ ఘడ్ నుంచి వేయి మెగావాట్ల విద్యుత్ తెలంగాణ కొనేందుకు ఎంవోయూ కుదుర్చుకుంది. కాగా ఈ విద్యుత్ తక్షణం పొందడానికి సరిపడా విద్యుత్ లైన్లు తెలంగాణకు లేవు.. దీంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వార్దా -డిచ్ పల్లి లైన్ పూర్తి కావాల్సి ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఈ లైన్ పూర్తయితే అప్పటి తరువాత చత్తీస్ ఘడ్ విద్యుత్ తెలంగాణకు అందుతుంది.. ఇప్పుడు ఒప్పందం కుదరడంతో ఇక విద్యుత్ రావడమే తరువాయి..