తెలంగాణకు కొత్త గవర్నర్.?

-ఖాళీగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు గవర్నర్ల నియామకంకు గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ :  ఖాళీగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు రానున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి..  ప్రస్తుతం కొందరు గవర్నర్లు రెండు, మూడు రాష్ట్రాలకు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో త్వరలోనే కొత్త గవర్నర్లను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు.

మోడీ విదేశీ పర్యటన నుంచి 18న తిరిగి వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన అసోం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్ లో గవర్నర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. జేడీయూ పాలిత బీహార్,  వామపక్షాల పాలిత త్రిపురకు గవర్నర్లను నియమిస్తారని అధికార వర్గాలు చెప్పాయి. అకాలీ దల్ బీజీపీ పాలనలో ఉన్న పంజాబ్ లోనూ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది.

కాగా ఈ నేపథ్యంలోనే తెలంగాణకు గవర్నర్ ను నియమించే అవకాశం ఉందని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ వ్యవహరించిన నరసింహన్ ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగుతున్నారు.  ఆయనను బదిలీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *