తెరమరుగు కవులను పైకి తెస్తున్నారు..

తెలంగాణ ఏర్పడ్డాక మార్పు ఖచ్చితంగా వచ్చింది.. ఆ మార్పు కళలు, సాహిత్యం, కళా రంగాలు, సినిమాల్లో స్పష్టమైన మార్పును తీసుకొచ్చింది ప్రభుత్వం.. ఎంతలా అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ లో పుట్టిన కవులు, కళాకారుల జయంతులు, ఉత్సవాలు అసలు పేరు కూడా వినిపించేంది కాదు.. అలాంటిది తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ కళాకారులకు గుర్తింపు లభించింది..

మొదటగా తెలంగాణ కవి కాళోజీ నారాయణరావును ప్రభుత్వం గుర్తించి ఆయన పేరునే హెల్త్ యూనివర్సిటీకి పేరు పెట్టి ఆయన జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం. ఆ తరువాత దివంగత పీవీ నారాయణరావుకు గుర్తింపు నిచ్చి సన్మానించింది. వీరే కాదు తెలంగాణ లో పుట్టి గతంలో చాలా గ్రంథాలు, కవులుగా పేరొందిన వారిని తెలంగాణ ప్రభుత్వం వెలికి తీసి మరీ వారి జయంతులు, వర్థంతులను నిర్వహిస్తూ కళాభిమానుల మనసును దోచుకుంటోంది.

ఇక ఈరోజు శ్రీ మద్రామాయన గ్రంథకర్త , ఆదికవి మహర్షి శ్రీ వాల్మీకి జయంతోత్సవాలను హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించ తలపెట్టింది.. ఉదయం జరిగే ఈ వేడుకకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.  మంత్రులు ఈటెల రాజేందర్, జోగురామన్న, మాజీ ఎమ్మెల్యే, వాల్మీకి జయంతి కమిటీ అధ్యక్షుడు గట్టు బీముడు తదితరులు ముఖ్య అతిథిగా హాజరై ఈ వాల్మీకి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *